మెదక్ పట్టణం నుంచి నిజామాబాద్ జిల్లా బోధన్ వరకు కొత్త నేషనల్ హైవే నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరికేస్తున్నారు. ఒక్క మెదక్ జిల్లా పరిధిలోనే మెదక్ పట్టణ శివారులో నుంచి జిల్లా సరిహద్దులోని పోచమ్మరాల్ వరకు దాదాపు 400 చెట్లను నరికేయనున్నారు. అనేక దశాబ్దాలుగా మెదక్ బోధన్ రూట్లో ప్రయాణించే వాహనదారులకు
పరిసర గ్రామాల పరిధి ప్రజలకు చల్లని నీడను, స్వచ్ఛమైన గాలిని అందిస్తున్న చెట్లను కరెంట్ రంపాలతో తెగ నరుకుతుండడం పట్ల పర్యావరణ పరిరక్షకులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు అభివృద్ధిలో భాగంగా చెట్లు తొలగింపు తప్పనిసరి కాగా... ప్రత్యామ్నాయంగా చెట్లు పెంచే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. - మెదక్, వెలుగు