పింఛన్ డబ్బుల కోసం వృద్ధురాలిని హత్య చేసిన మనవడు

మేడ్చల్ జిల్లా రావకొల్ గ్రామంలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో వృద్ధురాలిని హత్య చేశాడు సొంత మనువడు. పింఛన్ డబ్బులు ఇవ్వాలంటూ వృద్ధురాలితో గొడవపడ్డాడు  ఆమె మనవడు  ప్రశాంత్. డబ్బులు ఇవ్వకపోవడంతో తలపై కొట్టి హత్య చేశాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.