2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ రెట్టింపవుతోంది. దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులు ఎవరన్నది ఇప్పటికే క్లారిటీ రావటంతో ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు నాయకులు. ఈ నేపథ్యంలో నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జనసేన అధినేత పావన కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒక రౌడీ అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గ్రంధి శ్రీనివాస్.
పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే అయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని, అతన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించాలని అన్నారు. నిర్లక్ష్యం చేస్తే అతని ప్రాణానికే ప్రమాదం వస్తుందని, ఒక మంచి నటుడ్ని కోల్పోతామని అన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ కొంత కాలం కిందట గ్రంధి శ్రీనివాస్ మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదని అన్నాడని, ఇప్పుడు తనని రౌడీ అంటున్నాడని అన్నారు.
తనపై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని, రౌడీ ఎలా అవుతానని ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ కు ఇంటి స్థలం అమ్మే వ్యక్తులను తాను బెదిరించినట్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నాడు. పవన్ కళ్యాణ్ ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలంటే తనకున్న భూమిలోనే ఎకరా, రెండెకరాలు ఇస్తానని అన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానం విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.