గ్రేటర్ ​వ్యాప్తంగా..హ్యాపీ.. హ్యాపీ క్రిస్మస్

గ్రేటర్ ​వ్యాప్తంగా క్రిస్మస్​ పండుగను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రధాన చర్చిలతోపాటు కాలనీల్లోని చర్చిలకు క్రైస్తవులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఫాదర్​లు, పాస్టర్లు చెప్పిన యేసు సందేశాన్ని విన్నారు. అనంతరం బంధువులు, స్నేహితులకు క్రిస్మస్​ విషెస్ ​చెప్పుకున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మెథడిస్ట్, జనరేషన్ ఫర్ క్రైస్ట్, ఇమ్మానియల్ ఏజీ చర్చిల్లో నిర్వహించిన ప్రార్థనల్లో అసెంబ్లీ స్పీకర్ ​గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్​ చైర్ ​పర్సన్ ​మంజుల పాల్గొన్నారు. 

రహ్మత్​నగర్ చౌరస్తాలోని బాప్టిస్ట్​ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్​ వేడుకల్లో కన్జ్యూమర్ రైట్స్ ​ప్రొటెక్షన్​ ఫోరం జాతీయ కార్యదర్శి  డాక్టర్​ పీవీ రవిశేఖరరెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్​ సెయింట్ థామస్, సెయింట్ మేరీ, సెయింట్ ఆన్స్, ఎస్​డీఎఫ్, మెట్టుగూడ సెయింట్​ఆంథోని, బోయిగూడ సెయింట్ జాన్ మరియా వియన్నే, చిలకలగూడ సీఎస్​ఐ, బౌద్దనగర్ ​బేతాని, అత్తాపూర్‌ క్రిస్టియన్‌ ఫెయిత్‌ సెంటర్‌ చర్చిల్లో, మియాపూర్​ కల్వరీ టెంపుల్​లో నిర్వహించిన ప్రార్థనల్లో క్రైస్తవులు భారీగా పాల్గొన్నారు. పలుచోట్ల అన్నదానం, బట్టల పంపిణీ చేశారు.