కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. గ్రామ్ ఉజాలా పథకం పేరుతో చేపట్టిన ఈ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రజలకు LED బల్బులను అతి తక్కువ ధరకే అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎల్ఈడీ బల్బులు కేవలం రూ.10 కే ఇవ్వనుంది. ప్రభుత్వ రంగానికి చెందిన కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ అనే కంపెనీ ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కంపెనీ ఈ కార్యక్రమం ప్రారంభించింది. మొదటి విడతగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో బల్బులను రూ.10కు అమ్మనుంది. ఈ బల్బులకు మూడేళ్ల వారంటీ కూడా ఉంటుంది.
