కాలువ రీ డిజైన్ చేయాలి

  • గ్రామ సభ బహిష్కరణ 

సిద్దిపేట (హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీసులో గౌరవెల్లి ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ 13 ఎల్ కాలువ భూ సేకరణ కోసం సోమవారం అధికారులు నిర్వహించిన గ్రామసభ రసభాసగా మారింది. కాలువను రీడిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ భూమి కోల్పోతున్న బాధితులు గ్రామసభను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలువ రీ డిజైన్ చేయకుండా భూసేకరణ చేయడం వల్ల విలువైన భూములను కోల్పోతున్నామని వాపోయారు. గతంలో నిర్మించిన కాలువలో తమ భూములను కొంత కోల్పోయామని, మళ్లీ ఇప్పుడు13 ఎల్ కాల్వ నిర్మాణం అంటూ ఉన్న భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. ఈ కాలువ నిర్మాణంతో రైతులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అధికారులు స్పందించి కాలువను రీడిజైన్ చేయాలని నిరసన తెలిపారు.