అకాల వర్షంతో తడిసిన ధాన్యం

గండీడ్/లింగాల, వెలుగు: మహమ్మదాబాద్  మండలంలోని గాదిర్యాల్ లో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో కాంటా చేసిన 300 వడ్ల బస్తాలతో పాటు రైతులు తీసుకొచ్చిన వడ్లు తడిసిపోయాయి. నిర్వాహకుల నిర్లక్ష్యంతో వడ్లు తడిసిపోయాయని రైతులు వాపోయారు. గ్రామానికి చెందిన టంకరి అంజిలమ్మ రెండెకరాల మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. లింగాల మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పదెకరాల మామిడి తోటకు నష్టం వాటిల్లింది. అంబటిపల్లి గ్రామానికి చెందిన గడ్డిగోపుల వెంకటయ్య గ్రామానికి సమీపంలోని పదెకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. ఈదురుగాలులు, వర్షంతో కాయలు రాలిపోవడంతో నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు.