శివ్వంపేట ఎంపీడీవో ఆఫీస్​ ముందు జీపీ కార్మికుల ధర్నా

శివ్వంపేట, వెలుగు: పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జీపీ కార్మికులు శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్​ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులకు 6  నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించిన చెల్లించడంలేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు.

కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేశ్, కార్యదర్శి శంకర్, బాలకృష్ణ, వసంత, పద్మ, స్వామి, కృష్ణ, హరి పాల్గొన్నారు.