ప్రభుత్వమే మా దగ్గరకు రావాలి

ప్రభుత్వమే మా దగ్గరకు రావాలి
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనలు 26వ రోజుకు చేరాయి. ఈ చట్టాలపై మరోమారు అన్నదాలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే చర్చలకు సంబంధించి సర్కార్ నుంచి తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదని రైతులు తెలిపారు. ‘వ్యవసాయ శాఖ మంత్రి నుంచి ఇప్పటివరకు మాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. మూడు కొత్త అగ్రి చట్టాలను గవర్నమెంట్ వెనక్కి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గబోమని రైతులు నిర్ణయించారు. అన్ని సమస్యలను పరిష్కరించడానికి నెలకు పైగా సమయం పడుతుంది. ప్రభుత్వమే మా దగ్గరకు వచ్చి వీటిని పరిష్కరించాలి’ అని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయిట్ స్పష్టం చేశారు.