అన్ని బ్యాంక్ అకౌంట్లు భీమ్‌‌ పైనే

అన్ని బ్యాంక్ అకౌంట్లు భీమ్‌‌ పైనే

పలు బ్యాంక్‌‌ అకౌంట్లను తన ప్లాట్‌‌ఫామ్‌‌పై లింక్​ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది భీమ్ యాప్.   ఈ వెర్షన్ అక్టోబర్‌‌‌‌లో లాంచ్ కానుంది. ‘భీమ్‌‌ను అప్‌‌గ్రేడ్ చేస్తున్నాం. దీని తర్వాతి వెర్షన్‌‌లో భీమ్ ప్లాట్‌‌ఫామ్‌‌ నుంచే పలు బ్యాంక్ అకౌంట్లను లింక్​ చేసుకునే అవకాశాన్ని యూజర్లకు కల్పిస్తున్నాం. అక్టోబర్‌‌‌‌లో దీన్ని లాంచ్ చేయనున్నాం’ అని అధికారులు ప్రకటించారు. భీమ్ తర్వాతి వెర్షన్, ప్రైవేట్ పేమెంట్ ప్లాట్‌‌ఫామ్‌‌లకు పూర్తి స్థాయిలో పోటీ ఇవ్వనుందని పేర్కొన్నారు. భీమ్ ఇప్పటికే యుటిలిటీస్‌‌ పేమెంట్ సర్వీసులను ఆఫర్ చేస్తోంది. ఇతర మెర్చంట్లను కూడా ఈ ప్లాట్‌‌ఫామ్‌‌ పైకి తీసుకువస్తామని అధికారులు చెప్పారు.