విద్యార్థులున్నా.. టీచర్ లేక మూతబడ్డ స్కూల్

కుభీర్, వెలుగు: ప్రతి గ్రామంలో ప్రభుత్వం స్కూల్ బిల్డింగ్ నిర్మించి అన్ని వసతులు కల్పించినా కొన్ని స్కూళ్లలో టీచర్లు లేక పేద విద్యార్థులకు సర్కారు విద్య అందడం లేదు. కుభీర్ మండలంలోని మారుమూల తండాల్లో టీచర్లు లేక బడులు మూతపడుతున్నాయి. మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న దావుజీ నాయక్ తాండాలోని ప్రైమరీ స్కూల్.. టీచర్ లేక మూతబడింది.

విద్యార్థులు ఉన్నప్పటికీ ఇక్కడ పనిచేసే టీచర్ బిట్ కాయిన్ వ్యవహారంలో సస్పెండ్ అయ్యారు. విద్యాధికారులు పట్టించుకోకపోవడంతో అప్పటి నుంచి స్కూల్ కు తాళం వేసి ఉంది.  తలకు మించిన భారం అయినప్పటికీ.. తాండావాసులు చేసేదేమీ లేక తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు.