ఆ కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ మస్ట్

ఆ కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ మస్ట్

న్యూఢిల్లీ: ప్యాసింజర్స్ వెహికల్స్ (ఎం1 కేటగిరీ)లో ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. 8 మంది వరకు ప్రయాణించగలిగే అన్ని ఫోర్ వీలర్లలో 6 ఎయిర్‌‌ బ్యాగులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డ్రాఫ్ట్ ఆర్డర్ పై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం సంతకం చేశారు.  డ్రైవర్ కోసం ఎయిర్ బ్యాగ్ ను 2019 జులై 1 నుంచి తప్పనిసరి చేశామని, ముందు సీట్లో కూర్చునే ప్రయాణికుడి భద్రత కోసం మరో ఎయిర్‌‌ బ్యాగును అమర్చడాన్ని 2022 జనవరి 1 నుంచి తప్పనిసరి చేశామని ఆయన ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు.