న్యూఢిల్లీ: కొత్త రిజిస్ట్రేషన్ పాలసీని ప్రకటించింది కేంద్ర రోడ్డు రవాణా-హైవేల మంత్రిత్వ శాఖ. కొత్తగా భారత్ సిరీస్ ను తీసుకొచ్చింది. ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనం... మరో రాష్ట్రంలో 12 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక వేళ ఉండాల్సి వస్తే... ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్తగా తీసుకొస్తున్న భారత్ BH సిరీస్ తో అలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తోంది కేంద్రం.
BH సిరీస్ లో రిజిస్టర్ చేసుకుంటే... దేశంలో ఎక్కడైనా వెహికిల్ ఉండొచ్చు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని కేంద్ర రోడ్డు రవాణా-హైవేల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. రక్షణ శాఖలోని వివిధ డిపార్ట్ మెంట్స్ లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల కంటే ఎక్కువ చోట్ల ఆఫీస్ లు ఉన్న ప్రైవేట్ సంస్థలకు మాత్రమే BH సిరీస్ రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంటుంది.
