వాహన డాక్యుమెంట్ల వాలిడిటీ సెప్టెంబర్ 30 వరకు

వాహన డాక్యుమెంట్ల వాలిడిటీ సెప్టెంబర్ 30 వరకు

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తూ ఓ ప్రకటన చేసింది. డ్రైవింగ్ లైసెన్స్(DL), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) వంటి డాక్యుమెంట్లకు సంబంధించిన  ముగిసిన గడువును పొడిగించింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ వంటి పలు రకాల వాహన డాక్యుమెంట్ల వాలిడిటీని కేంద్ర ప్రభుత్వం గతంలో 2021 జూన్ 30 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు ఈ గడువును మళ్లీ సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో .. వెహికల్‌కు చెందిన ఫిట్‌నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లు అన్నీ సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి. డ్రైవింగ్ టెస్ట్ పాస్ అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.