ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పొడిగింపు

ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పొడిగింపు
ఐటీ రిటర్న్ ల దాఖలుకు సంబంధించిన గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. వ్యక్తిగత ట్యాక్స్ చెల్లింపుదారులకు 10 రోజుల గడువు ఇచ్చింది.2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన IT రిటర్న్ లను జనవరి 10 వరకు దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది. కంపెనీ ఐటీ రిటర్న్ లు దాఖలు చేసుకునేందుకు 15 రోజుల గడువును పెంచింది. ఫిబ్రవరి 15 లోపు రిటర్న్ లు దాఖలు చేసుకునే వీలు కల్పించింది. కరోనా కారణంగా ట్యాక్స్ చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్నుశాఖ తెలిపింది. అంతకు ముందు వ్యక్తిగత ట్యాక్స్ చెల్లింపు దారులకు ఐటీ రిటర్న్ ల దాఖలు గడువును డిసెంబర్ 31 గా.. కంపెనీలకు జనవరి 31 గా ఆర్ధిక మంత్రిత్వశాఖ నిర్ణయించింది.