ఫాస్టాగ్ గడువును పెంచిన కేంద్ర సర్కార్

ఫాస్టాగ్ గడువును పెంచిన కేంద్ర సర్కార్
న్యూఢిల్లీ: ఫాస్టాగ్ గడువును కేంద్ర ప్రభుత్వం పెంచింది. జనవరి 1తో ముగియనున్న డెడ్‌‌లైన్‌‌ను మరో నెలన్నరకు పెంపు చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌‌లైన్ ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నేషనల్ హైవే నెట్‌‌వర్క్‌‌లో వంద శాతం టోల్ ఫీజుల సేకరణ కోసం గడువును మరికొన్ని రోజులు పెంచినట్లు పేర్కొంది. క్యాష్‌‌లెస్ ట్రాన్సాక్షన్స్‌‌ను పెంచడంలో భాగంగా కేంద్రం ఫాస్టాగ్‌‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం టోల్‌‌గేట్ల వద్ద ఫాస్టాగ్ ద్వారా జరుగుతున్న లావాదేవీలతో 75 నుంచి 80 శాతం ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో గడువును పెంచడం ద్వారా 100 శాతం ఫాస్టాగ్ లక్ష్యాన్ని చేరుకోవాలని ఎన్‌‌హెచ్ఏఐతోపాటు కేంద్రం భావిస్తోంది. క్యాష్ లావాదేవీలను తగ్గించడంతోపాటు టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీని తగ్గించడంలోనూ ఫాస్టాగ్ బాగా పని చేస్తోందని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.