ప్రధాన ఆర్థిక సలహాదారుగా  వి.అనంత నాగేశ్వరన్‌ 

ప్రధాన ఆర్థిక సలహాదారుగా  వి.అనంత నాగేశ్వరన్‌ 

ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA)గా ఆర్థికవేత్త వి.అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం  నియమించింది. నాగేశ్వరన్‌ బాధ్యతలు స్వీకరించినట్లు అధికారిక ప్రకటన చేసింది. ఇంతకు ముందు ఉన్న CEA కెవి సుబ్రమణియన్‌ తన మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత డిసెంబర్‌ 2021 లో సిఇఎ పదవి నుండి వైదొలిగారు.

ఆర్థికవేత్త నాగేశ్వరన్‌ రచయిత, ఉపాధ్యాయుడు, సలహాదారుగా ఉన్నారని, భారతదేశం-సింగపూర్‌లోని అనేక వ్యాపార స్కూళ్లు, మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో టీచింగ్ చేశారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.CEAగా నియామకానికి ముందు నాగేశ్వరన్‌ IFMR గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు డీన్‌గా, ఆంధ్రప్రదేశ్‌లోని క్రియా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 2019 నుండి 2021 వరకు భారత ప్రధాన మంత్రికి ఆర్థిక సలహా మండలిలో పార్ట్‌ టైమ్‌ సభ్యునిగా కూడా నాగేశ్వరన్‌ పనిచేశారు.

మరిన్ని వార్తల కోసం...

కొవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు