నేషనల్ గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌‌‌  పాలసీ వచ్చింది!

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌‌‌  పాలసీ వచ్చింది!

న్యూఢిల్లీ: ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేషనల్ హైడ్రోజన్ పాలసీలో మొదటి భాగాన్ని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. హైడ్రోజన్‌‌‌‌ను తయారు చేయడానికి రెన్యువబుల్ ఎనర్జీ సోర్స్‌‌‌‌ల ద్వారా జనరేట్ అయిన పవర్‌‌‌‌‌‌‌‌ను ఫ్రీగా ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది.  గ్రీన్‌‌‌‌ ఎనర్జీని తయారు చేసే ఖర్చు ఈ పాలసీ ద్వారా తగ్గుతుందని పవర్ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌ కుమార్ సింగ్ పేర్కొన్నారు.  ఈ పాలసీ కింద, కంపెనీలు సొంతంగా లేదా పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ల ద్వారా  సోలార్‌‌‌‌‌‌‌‌, విండ్ వంటి రెన్యువబుల్ ఎనర్జీల కోసం దేశంలో ఎక్కడైనా ప్లాంట్‌‌‌‌ను పెట్టే స్వేచ్చ ఉంటుంది. ఈ ప్లాంట్ల నుంచి  జనరేట్ అయిన రెన్యువబుల్ ఎనర్జీని ఓపెన్‌‌‌‌గా అందుబాటులో ఉండే  ట్రాన్స్‌‌‌‌మిషన్ గ్రిడ్స్ ద్వారా హైడ్రోజన్ తయారు చేసే ప్లాంట్లకు ఫ్రీగా ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసుకోవచ్చు.  అంతేకాకుండా గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌ను ఎక్కువగా తయారు చేస్తే, దానిని స్టోర్ చేసుకోవడానికి  ప్రభుత్వం అనుమతిస్తోంది. 2025 లోపు ఏర్పాటయిన కంపెనీలు 30 రోజుల వరకు అదనంగా ప్రొడ్యూస్ అయిన గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌ను స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.