నేను ఎప్పటి నుంచో సత్యసాయి భక్తురాలిని

నేను ఎప్పటి నుంచో సత్యసాయి భక్తురాలిని

తాను ఎప్పటి నుంచో సత్యసాయి భక్తురాలినన్నారు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా 94వ జయంతి ఉత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  గవర్నర్‌ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళి సై మాట్లాడుతూ.. మహిళలు ఆదర్శవంతమైన భావంతో మెలిగినప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరన్నారు. తమిళనాడులోని సుందరంలోని సత్యసాయి మందిరాన్ని నిత్యం సందర్శించుకునేవారమని చెప్పారు. ప్రతి గురువారం సుందరం వెళ్లనిదే రోజు గడిచేదికాదన్నారు.

దేశంలో ఏ ఆసుపత్రిలోనైనా అన్ని విభాగాలతో పాటు బిల్లు కట్టే విభాగం కూడా ఉంటుందని.. కాని సత్యసాయి ఆసుపత్రుల్లో అలాంటి విభాగం కనిపించలేదన్నారు. సత్యసాయి చేపట్టిన సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివని కొనియాడారు గవర్నర్‌. నేటి తరంలో మహిళలు రాజకీయాల్లో రాణించడం కష్టంగా మారిందని.. తనకు భిజేపి మంచి అవకాశం కల్పించిందని చెప్పారు. తాను వైద్యురాలిగా, రాజకీయాల్లో సేవలందించడం ఆనందంగా ఉందన్నారు తమిళి సై.