ఏ జిల్లానూ రద్దు చేయట్లేదు : మంత్రి పొంగులేటి

  • మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను కూడా రద్దు చేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం శాసన మండలిలో పొంగులేటి మాట్లాడుతూ.. ఏ జిల్లాను రద్దు చేయబోమని, పాత జిల్లాలను రద్దు చేసే ఆలోచనే తమ ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. 

సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళుతున్నారని, కానీ నిధులు తెచ్చారా? అని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపైనా మంత్రి స్పందించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రం వద్దకు తరచూ నిధుల కోసం వెళ్లడం సాధారణ విషయమేనని, కానీ వెళ్లిన ప్రతిసారీ నిధులు రావని గుర్తించాలన్నారు. తెలంగాణ వచ్చాక పదేండ్లు బీఆర్ఎస్ పాలించిందని, వారి హయాంలో కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకువచ్చారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తమది పేదల ప్రభుత్వమన్నారు. పేదల కోసం అనునిత్యం పని చేస్తామని చెప్పారు.