గవర్నమెంట్ టీచర్స్ జేఏసీ చైర్మన్​గా వీరాచారి

హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ టీచర్స్ జేఏసీ (టీజీజేఏసీ) చైర్మన్ గా మామిడోజు వీరాచారి ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్ గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంఘాలు సమావేశమై  జేఏసీగా ఏర్పడ్డాయి. టీజీ జేఏసీ సెక్రటరీ జనరల్ గా మేకల లక్ష్మీకాంతరెడ్డి, కో చైర్మన్లుగా బైండ్ల నర్సింహా, ఎం.నళిని, కన్వీనర్ గా డి. గిరివర్ధన్, కో కన్వీనర్ గా కె. శ్రీనివాస్ గౌడ్, మహిళా సెక్రటరీగా కోట సుకన్య ఎన్నికయ్యారు. గవర్నమెంట్ మేనేజ్మెంట్లలోని టీచర్లకే విద్యాశాఖలోని అన్ని ప్రమోషన్లు ఇవ్వాలని, జేఎల్స్, డైట్ లెక్చరర్స్, డిప్యూటీ ఈవో, ఎంఈవోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని తీర్మానించారు.