సహకార బ్యాంకులను బలోపేతం చేయాలి

  • ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

బషీర్ బాగ్, వెలుగు: వ్యవసాయ రంగానికి, రైతుకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న సహకార బ్యాంకుల బలోపేతానికి ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.  ప్రభుత్వ శాఖలకు చెందిన నిధులను కొంత సహకార బ్యాంకుల్లో డిపాజట్ చేసి కార్యకలాపాలు జరపాలని సూచించారు. 

ఉద్యోగుల పోరాటాలకు సీపీఐ అండగా ఉంటుందని చెప్పారు. శనివారం కాచిగూడలోని మ్యాడం అంజయ్యభవన్ లో తెలంగాణ సహకార సెంట్రల్ బ్యాంకుల ఉద్యోగుల  అసోసియేషన్ రాష్ట్ర మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సహకార బ్యాంకుల వ్యవస్థలో రెండంచెల వ్యవస్థను అమలు చేయాలనే ఉద్యోగుల డిమాండ్ న్యాయమైనదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు.