థియేటర్లు ఫుల్ చేసుకోవడానికి సర్కార్ పర్మిషన్

థియేటర్లు ఫుల్ చేసుకోవడానికి సర్కార్ పర్మిషన్
థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ తమిళనాడు సర్కారు నిర్ణయం చెన్నై: సినిమా థియేటర్లను 100% ఆక్యుపెన్సీతో నడిపించుకునేందుకు తమిళనాడు సర్కారు పర్మిషనిచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా మొన్నటి వరకు 50% సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు రన్ అయ్యేవి. తాజాగా, దీనిని పెంచుతూ సీఎం పళనిసామి సోమవారం ఆదేశాలిచ్చారు. హీరో విజయ్ ‘మాస్టర్’ సినిమా వచ్చే వారం విడుదల అవుతోంది. ఈ క్రమంలో ఆయన సీఎం పళనిసామితో భేటీ అయ్యారు. సీటింగ్ కెపాసిటీని పెంచాలంటూ ఆయన చేసిన రిక్వెస్ట్ కు సీఎం ఓకే చెప్పారు. మరో యాక్టర్ సిళంబరసన్ కూడా సీటింగ్ కెపాసిటీ పెంపు కోరారు. ఆయన సినిమా సంక్రాతికి వస్తోంది. కాగా, కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాపించే టైమ్ లో ఇదేం నిర్ణయమని సీఎంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.