జల్లికట్టుకు గ్రీన్ సిగ్నలిచ్చిన తమిళనాడు ప్రభుత్వం

జల్లికట్టుకు గ్రీన్ సిగ్నలిచ్చిన తమిళనాడు ప్రభుత్వం
కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తమ రోజూవారి కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు ప్రజలు. అయితే పండుగలకు, వేడుకలకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి అనుమతులు ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ అనగానే దేశవ్యాప్తంగా గుర్తుకువచ్చేది జల్లికట్టు. సంక్రాంతి పండుగ అంటే జల్లికట్టు ఉండాల్సిందే అంటారు తమిళ ప్రజలు. ఈ జల్లికట్టుకు అంత ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఏదేమైనా తాము ఈ వేడుకను జరిపి తీరుతామని తమిళ ప్రజలు కోర్టును ఆశ్రయించారు. అయితే కరోనా క్రమంలో జల్లికట్టు నిర్వహిస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. కరోనా కారణంగా జాగ్రత్తలు పాటిస్తూ జల్లికట్టు వేడుకను నిర్వహించుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జల్లికట్టు నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే జల్లికట్టులో పాల్గొనాలని, సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు, శానిటైజర్లు వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తానికి కరోనా సమయంలో కూడా జల్లికట్టు వేడుకకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం దాని నిర్వహణకు అనుమతినివ్వడంతో తమిళనాడు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.