ఆపరేషన్ సద్భావ్​ అంటే ఏంటి ?

యాగీ తుపాన్​ కారణంగా వియత్నాం, లావోస్​, మయన్మార్​ల్లో సంభవించిన వరదల నేపథ్యంలో అత్యవసర మానవతా సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సద్భావ్​ను ప్రారంభించింది. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఉత్తర వియత్నాంలోని బాధితులకు ఉపశమనం అందించడానికి భారతదేశం మిలియన్ అమెరికన్​ డాలర్ల విలువైన మానవతా సహాయం అందించింది. 

    వాటర్​ ప్యూరిఫైయర్లు, నీటి కంటైనర్లు దుప్పట్లు, దోమ తెరలు, స్లీపింగ్​ బ్యాగ్​లు, జెన్​సెట్లు, నీటి శుద్ధీకరణ మాత్రలు, క్రిమిసంహారకాలు, వంటగది పాత్రలు, సోలార్​ లాంతర్లు సహా 35 టన్నుల మానవతా సహాయాన్ని ప్రత్యేక విమానం ద్వారా వియత్నానికి తరలించింది. 
    లావోస్​ పీడీర్ ప్రభుత్వానికి 10 టన్నుల మానవతా సహాయం అందించారు. వరదలు, కొండచరియలు ఉత్తర లావోస్​లో సుమారు 40 వేల మంది ప్రజలను ప్రభావితం చేశాయి. ఆస్తి, పంట నష్టాన్ని మిగిల్చాయి. 
    లావో ప్రభుత్వానికి 10 టన్నుల మానవతా సహాయం అందించారు. పరిశుభ్రత కిట్లు, దుప్పట్లు, దోమ తెరలు, స్లీపింగ్​ బ్యాగ్​లు, జెన్​సెట్లు, వాటర్​ ప్యూరిఫైయర్లు, వాటర్​ ఫ్యూరిఫికేషన్​ ట్యాబ్లెట్లతోపాటు ఇతర మెటీరియళ్ల రూపంలో భారత్​ నుంచి ప్రత్యేక విమానంలో పంపించారు.