బ్యాంక్ లింకేజీ లోన్లతో ఆర్థిక స్వావలంబన

  • జిల్లాలో 13,064 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు 
  • 2024 - 25 లోన్ల టార్గెట్​ రూ.592.62 కోట్లు 
  • ఇప్పటికే రూ.454.53 కోట్లు మంజూరు
  • చిరు వ్యాపారాలతో ఉపాధి పొందుతున్న మహిళలు 

మెదక్, వెలుగు: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం బ్యాంక్​ లింకేజీ ద్వారా విరివిగా రుణాలు అందిస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్​డీఏ) ద్వారా సెల్ప్​హెల్ప్​ గ్రూప్​ (ఎస్​ హెచ్​జీ) లకు లోన్లు మంజూరు చేయడంలో మెదక్​ జిల్లా స్టేట్​లో ముందుంది. జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 13,064 సెల్ప్​ హెల్ఫ్​ గ్రూప్​ లు ఉన్నాయి, వీటిలో 1,37,654 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 521 వీఓఏలు, 21 మండల సమాఖ్యలు, ఒక జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్​ హెచ్​ జీలు పని చేస్తున్నాయి.

సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు బ్యాంక్​ లింకేజీ ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 10,664 సెల్ప్ హెల్ప్​ గ్రూప్​ లకు బ్యాంక్​లింకేజీ కింద రూ.592 .61 కోట్ల వరకు లోన్లు మంజూరు చేయాలని అధికారలు టార్గెట్​ పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 5,501 ఎస్​ హెచ్​ జీలకు రూ.454.53 కోట్ల రుణాలు మంజూరు చేసి.. 76.70 శాతంటార్గెట్ పూర్తి చేశారు.

శివ్వంపేట, నార్సింగి మండలాల్లో 100 శాతానికి మించి రుణాలు అందించగా, నర్సాపూర్​, కౌడిపల్లి, తూప్రాన్​ మండలాల్లో టార్గెట్​ కంప్లీట్​ చేయడానికి దగ్గరగా ఉన్నారు. ఫైనాన్షియల్​ ఇయర్ ముగియడానికి ఇంకా మూడు నెలల వ్యవధి ఉంది. ఈ మూడు నెలల్లో అన్ని మండలాల్లో టార్గెట్​ పూర్తి చేసేందుకు అధికారులు, బ్యాంకర్లు చర్యలు తీసుకుంటున్నారు. 

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి జిల్లాలో పర్యటించినప్పుడు సెల్ప్​ హెల్ప్​ గ్రూప్​ లకు రూ.102 కోట్ల రుణాల చెక్కును అందించారు. బ్యాంక్​ లింకేజీ కింద స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలతో మహిళలు కిరాణ షాప్​లు, బ్యాంగిల్​ స్టోర్​లు, జిరాక్స్​ సెంటర్​లు, రెడీమెడ్​ క్లాత్​ స్టోర్​తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో చాలామంది మహిళలు వ్యాపారాల్లో రాణిస్తూ తమ కాళ్ల మీత తాము నిలబడుతున్నారు.

మండలాల వారీగా లోన్ల వివరాలు.. 

మండలం             సంఘాలు  టార్గెట్  పూర్తయ్యింది

శివ్వంపేట                         622    2,685    2,920 
నార్సింగి                            287    1,634    1,659
నర్సాపూర్                          582    3,724    3,666
కౌడిపల్లి                              547    2,834    2,638
తూప్రాన్​                             359    2,185    2,025
మెదక్                                  505    2,725    2,434
చేగుంట                               747    3,866    3,263
హెచ్​ఘనపూర్                    608    3,045    2,466
నిజాంపేట                           462    2,426    1,862
అల్లాదుర్గం                          460    2,893    2,135
మనోహరాబాద్​                    438​    2,868    2,096
కొల్చారం                              619    3,515    2,539
చిన్నశంకరంపేట               700    4,078    2,781
టేక్మాల్                             ​    471    2,014    1,363
వెల్దుర్తి                                  706    3,304    2,201
పాపన్నపేట                         732    4,646    2,995
రామాయంపేట                    421    2,048    1,295
పెద్దశంకరంపేట                 671    4,086    2,506
రేగోడ్​                                    383    2,708    1,590
చిలప్​చెడ్                           344    1,968    1,010