మదనాపురం మార్కెట్  చైర్మన్ గా ప్రశాంత్

మదనాపురం, వెలుగు: మదనాపురం వ్యవసాయ మార్కెట్  కమిటీ చైర్మన్ గా కొత్తకోటకు చెందిన పల్లెపాగ ప్రశాంత్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్ గా అజ్జకొల్లు గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి, డైరెక్టర్లుగా గొల్ల మేకల రామచంద్రయ్య(పామాపురం), కె శ్రీనివాసులు(తిర్మలాయపల్లె), ఎస్ రాములు(పాలెం), గొల్ల మాసన్న(దుప్పల్లి), తూమ్ విజయ్(నెల్విడి), పావని (దంతనూరు), వెంకటేశ్ నాయక్ (కొన్నూరు తండా)

 శేఖర్ రెడ్డి(అడ్డాకుల), బొక్క బాలయ్య(రాచాల), పేరు మహమ్మద్(కొమిరెడ్డి పల్లె), చంద్రాయుడు(ట్రేడర్), రజినీ కాంత్(ట్రేదర్)లను నియమించింది. తనపై నమ్మకంతో చైర్మన్​గా బాధ్యతలు అప్పగించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రశాంత్​ కృతజ్ఞతలు  తెలిపారు.