గ్రామాల సుందరీకరణకు కృషి : రాజేశ్ రెడ్డి

కందనూలు, వెలుగు: నియోజకవర్గంలోని గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి తెలిపారు. మంగళవారం నియోజకవర్గంలోని బిజినేపల్లి, తిమ్మాజిపేట ,తాడూరు, తెలకపల్లి, నాగర్ కర్నూల్  మండలాల్లోని పలు గ్రామాల్లో అంగన్​వాడీ సెంటర్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

బిజినేపల్లి మండలం సాయినిపల్లిలోని మార్కండేయ లిఫ్ట్​ పనులను పరిశీలించారు. వచ్చే నెల 15 వరకు ప్రాజెక్ట్​  పనులు కంప్లీట్​ చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నాగర్ కర్నూల్ లో మాలల సింహగర్జన వాల్  పోస్టర్​ను ఆవిష్కరించారు. వెంకటస్వామి, తిరుపతయ్య, వీరేందర్, హరీశ్ రెడ్డి, వాల్యా నాయక్, కొండ నాగేశ్, బంగారు పర్వతాలు పాల్గొన్నారు.