2,636 ఈవీ పాయింట్లకు అనుమతి
న్యూఢిల్లీ : ఫేమ్ ఇండియా స్కీమ్ కింద 2,636 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 62 నగరాల్లో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావ్‌డేకర్ చెప్పారు. కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ మోడల్స్ లాంచ్ చేసేలా ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్‌ను ప్రోత్సహించేందుకు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేస్ 2 కింద ప్రోత్సాహకాలు పొందుతూ నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే సంస్థల నుంచి ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఇంటరస్ట్‌ను హెవీ ఇండస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఆహ్వానిస్తోంది. ఫేమ్ ఇండియా ఫేజ్ 2 కింద మహారాష్ట్రలో 317 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, తెలంగాణలో 138, ఏపీలో 266, తమిళనాడులో 256, గుజరాత్‌లో 228, రాజస్తాన్‌లో 205, యూపీలో 207, కర్నాటకలో 172, ఎంపీలో 159, వెస్ట్ బెంగాల్‌లో 141, కేరళలో 131, ఢిల్లీలో 72, చండీఘర్‌లో 70, హర్యానాలో 50, మేఘాలయలో 40, బిహార్‌లో 37, సిక్కింలో 29, జమ్ము, శ్రీనగర్, చత్తీస్‌గడ్‌లో 25 చొప్పున, అస్సాంలో 20, ఒడిశాలో 18, ఉత్తరఖాండ్, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్‌లలో 10 చొప్పున స్టేషన్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

