మెదక్​కు రూ.750 కోట్ల నిధులు : ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​టౌన్, వెలుగు : మెదక్​నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తొలి ఏడాదిలోనే రూ.750 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే రోహిత్​రావు మంగళవారం తెలిపారు. సీఎం హోదాలో రేవంత్​రెడ్డి ఏడుపాయలకు రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్​ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగిందని రోహిత్​రావు విమర్శించారు.