అయ్యప్ప స్వాములు వావర్ మసీదుకు వెళ్లొద్దు

  • 41 రోజులు దీక్ష చేసి సమాధి ఉన్న మసీదుకు వెళ్తే అపచారం
  • గోషామహల్​ ఎమ్మెల్యే రాజా సింగ్

బషీర్ బాగ్, వెలుగు :  అయ్యప్ప దీక్షా పరులు శబరిమలకు వెళ్తూ దారిలోని వావర్ మజీద్ కు వెళ్లొద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. 41 రోజులు నిష్ఠగా దీక్ష చేసి సమాధి ఉన్న మసీదుకు వెళ్లడం అపచారం అని చెప్పారు. అయ్యప్ప దీక్షా పరులు తప్పకుండా వావర్ మసీదుకు వెళ్లాలని చాలా కాలంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దాని వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అయ్యప్ప మాల ధరించిన ప్రతి ఒక్కరూ నేరుగా శబరిమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.

భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి(బాస్) ఆధ్వర్యంలో శబరిమలకు వెళ్లే దారిలోని నీలక్కల్ వద్ద ఈ నెల 7 నుండి 14 వరకు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయనున్నారు. శుక్రవారం అన్నదాన సామాగ్రిని తీసుకెళ్తున్న లారీని ఎమ్మెల్యే రాజాసింగ్ జెండా ఊపి ప్రారంభించారు. 16 ఏండ్లుగా బాస్ సంస్థ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.  బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, బాస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.