గుగూల్ లో ఈ ఏడాది ఎక్కవగా వెతికింది ఏంటో తెలుసా?

గుగూల్ లో ఈ ఏడాది ఎక్కవగా వెతికింది ఏంటో తెలుసా?

చిన్నా..పెద్ద.. ఎవరికి.. ఏ డౌట్‌‌ వచ్చినా వెంటనే ‘గూగుల్‌‌ చెయ్‌‌’ అంటారు. ప్రపంచంలో ఎక్కడ? ఎప్పుడు? ఏం జరిగింది? అనేది క్షణాల్లో చెప్పేస్తది గూగుల్‌‌. వ్యక్తి, వస్తువు, ప్లేస్‌‌ టాపిక్‌‌ ఏదైనా... అడగడం ఆలస్యం వాటి వివరాలు చెప్పేస్తుంది ఈ పేదరాసి పెద్దమ్మ. ప్రపంచంలో ప్రతి ఒకరు ఆ పెద్దమ్మకి పిల్లలే. ఏదైనా విషయం జరిగిందంటే చాలు ప్రతి ఒక్కరు ఆ విషయం గురించి ఆమెనే అడుగుతారు. అలా ఈ ఏడాది మనోళ్లు గూగుల్‌‌ తల్లిని అడిగిన విషయాలు ఏవంటే? 

ఏడాది చివరికి వచ్చేశాం. ఈ ఏడాది మొత్తం జరిగిన విషయాలను నెమరేసుకుంటాం. అలానే గూగుల్‌‌ కూడా ఏటా.. గూగుల్‌‌ స్టాటిస్టిక్స్‌‌ను రిలీజ్‌‌ చేస్తుంది. ఏ విషయం గురించి, ఏ వస్తువు గురించి, ఎవరి గురించి ఎక్కువగా అడిగారనే విషయాన్ని పంచుకుంటుంది. ఈ ఏడాది మన దేశంలో ఐసీసీ టీ 20, ఇండియన్‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌ (ఐపీఎల్‌‌) గురించి తెగ వెతికారట. అవే టాప్‌‌ సెర్చ్‌‌లో ఉన్నాయని చెప్పింది గూగుల్‌‌. వాటి తర్వాత కొవిన్‌‌, యూరోకప్‌‌, టోక్యో ఒలింపిక్స్‌‌ టాప్‌‌ – 5లో ఉన్నాయి. 
టోక్యో ఒలింపిక్స్‌‌లో మన దేశానికి గోల్డ్‌‌ తెచ్చిన అథ్లెట్‌‌ నీరజ్‌‌ చోప్రా గురించి కూడా తెగ వెతికారట ఈ ఏడాది. అందుకే, ఆయన ‘మోస్ట్‌‌ సెర్చ్‌‌డ్‌‌ పర్సనాలిటీ’ లిస్ట్‌‌లో ఫస్ట్‌‌ ప్లేస్​లో ఉన్నాడు. ఆయన తర్వాత ఆర్యన్‌‌ ఖాన్‌‌ సెకెండ్‌‌ప్లేస్‌‌లో ఉండగా.. షెహనాజ్‌‌ గిల్‌‌, రాజ్‌‌కుంద్ర మూడు, నాలుగో ప్లేస్‌‌లో ఉన్నారట. వాళ్లిద్దరి తర్వాత ఎలన్‌‌ మాస్క్‌‌ది ఐదో ప్లేస్‌‌. 

 ఓవరాల్‌‌ టాప్‌‌ – 5 సెర్చ్‌‌లో ఇండియన్‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌ (ఐపీఎల్‌‌), కొవిన్‌‌, ఐసీసీ టీ 20 వరల్డ్‌‌ కప్‌‌, యూరో కప్‌‌, టోక్యో కప్‌‌ ఉన్నాయట. ఆర్యన్‌‌ ఖాన్‌‌ ఓవరాల్‌‌ ఇండియా టాప్‌‌ సెర్చ్‌‌లో పదో ప్లేస్‌‌లో ఉన్నాడని గూగుల్‌‌ స్టాటిస్టిక్స్‌‌ చెప్తున్నాయి.  ఇక ప్రపంచం మొత్తం మీద ఈ ఏడాది టాప్‌‌ సెర్చ్‌‌లో ‘ఒక సమస్య నుంచి ఎలా బయట పడాలి?’, ‘ఇంకో లాక్‌‌డౌన్‌‌ ఉంటుందా?’, ‘మెంటల్‌‌ హెల్త్‌‌ను ఎలా మెరుగుపరుచుకోవాలి?’, ‘స్ట్రాంగ్‌‌గా ఎలా ఉండాలి?’, ‘నా వ్యాక్సిన్‌‌ టర్న్‌‌ ఎప్పుడు వస్తుంది?’, ‘నా ఫ్యామిలీని నేను ఎప్పుడు కలుసుకోవచ్చు?’ లాంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగారని గూగుల్‌‌ ఒక వీడియో రిలీజ్‌‌ చేసింది. ఈ ప్రశ్నలకు సంబంధించి కొందరు సెలబ్రిటీల వాయిస్​ను యాడ్‌‌ చేస్తూ రిలీజ్‌‌ చేసిన వీడియో ఇప్పుడు ట్రెండ్​ అవుతోంది.