గూగుల్ ప్లే స్టోర్: నిలిచిపోనున్న నైబర్లీ యాప్ సేవలు

గూగుల్ ప్లే స్టోర్: నిలిచిపోనున్న నైబర్లీ యాప్ సేవలు

గూగుల్ ప్లే స్టోర్ నుంచి నైబర్లీ అనే యాప్‌ను తొలగిస్తున్నట్లు తెలిపింది ఆసంస్థ. మే12వరకు మాత్రమే నైబర్లీ యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుందని చెప్పింది. గూగుల్ టేకౌట్ ద్వారా యూజర్ల సమాచారాన్ని వెనక్కి తీసుకోవాలని తెలిపింది. అయితే ఈ యాప్ బేటా వర్షన్ మాత్రమే ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చింది. పూర్తి వర్షన్ కోసం ఎదురుచూసిన యాజర్లకు నిరాశేమిగిలింది. సదరు నైబర్లీ యాప్‌ను గూగుల్ కు చెందిన నెక్ట్ బిలియన్ ఇన్షియేటివ్ టీం డెవలప్ చేసింది. ఇది ముఖ్యంగా భారతీయులను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన యాప్. ఇందులో మన ఏరియాకు దగ్గరగా ఉండే షాప్స్, మాల్స్ వివరాలు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. యాప్‌లోకి వెళ్లాక మనకు కావలసిన షాప్ వివరాలను వాయిస్ ద్వారా అడిగితే ఆ ఏరియాలో యాప్‌లో యూజర్లుగా ఉన్నవాళ్లు సమాదానం ఇస్తారు. ఉదాహరణకు… లాండ్రీ, షాపింగ్ మాల్స్, ఎలక్ట్రిక్ షాప్ ఇలా ఏదైనా కావాలసిన వాటి వివరాలను అడిగితే చుట్టుపక్కల ఉన్న వాళ్లు యాప్ లో సమాదానం ఇస్తారు. అయితే వాళ్లుకూడా యాప్‌ను వాడుతుండాలి.

గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి శాశ్వతంగా ఒక యాప్‌ను తొలగిస్తుండటంతో గూగుల్ ప్రేమికులు వర్రీ అవుతున్నారు. ఫేస్బుక్ లాంటి యాప్‌లను ఢీకొట్టేందుకు గూగుల్ రెడీ అవ్వాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఇది ఆరోగ్యకరమైన పోటీలాగే ఉండాలని అంటున్నారు.  గూగుల్ తన వినియోగదారులకు మెయిల్ ద్వారా సమాదానం ఇస్తూ.. నైబర్లీ యాప్ అనుకున్నంతగా డెవలప్ కాలేదని తెలిపారు. దీంతో పాటు జనాలు ఇంకా నైబర్లీ యాప్‌ను అక్కునచేర్చుకోలేదని అన్నారు. దీంతో తాము వెనుతిరుగుతున్నామని చెప్పారు.