చిన్న నగరాల్లోని స్టార్టప్లకు చేయూత

చిన్న నగరాల్లోని స్టార్టప్లకు చేయూత

న్యూఢిల్లీ:  చిన్న సిటీల్లోని స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌లకు సాయం అందించేందుకు కొత్త ప్రోగ్రామ్‌‌‌‌ను గూగుల్‌‌‌‌ లాంచ్ చేసింది. ‘గూగుల్‌‌‌‌  స్టార్టప్‌‌‌‌ స్కూల్ ఇండియా’ కింద తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ ద్వారా  బిజినెస్‌‌‌‌ను ఎలా విస్తరించుకోవాలనే అంశంపై స్టార్టప్‌‌‌‌లకు మెంటరింగ్ అందిస్తారు. ఈ ప్రోగ్రామ్‌‌‌‌  తొమ్మిది వారాల పాటు వర్చువల్‌‌‌‌గా జరగనుంది. మిడిల్ స్టేజ్‌‌‌‌లో ఉన్న స్టార్టప్‌‌‌‌లను మాత్రమే గూగుల్‌‌‌‌ స్టార్టప్ స్కూల్‌‌‌‌లో జాయిన్ చేసుకుంటారు.  టైర్‌‌‌‌‌‌‌‌ 2, టైర్‌‌‌‌‌‌‌‌ 3 సిటీలలోని స్టార్టప్‌‌‌‌లను గుర్తించడంపై ఈ ప్రోగ్రామ్‌‌‌‌ ఎక్కువగా ఫోకస్ చేయనుంది.  మొదటి ఎడిషన్ కింద ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌ నాటికి 10 వేల స్టార్టప్‌‌‌‌లను  చేర్చుకోవాలని గూగుల్‌‌‌‌ టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది.  సరియైన ప్రొడక్ట్‌‌‌‌ను  గుర్తించడం, డిజైన్‌‌‌‌, టెక్నాలజీ, మార్కెటింగ్‌‌‌‌, బిజినెస్ స్ట్రాటజీ వంటి వివిధ విభాగాల్లో ఎలా మెరుగుపడాలనే అంశాలపై స్టార్టప్‌‌‌‌లకు మెంటరింగ్ అందించనున్నారు.  కేవలం గూగుల్‌‌‌‌కు చెందిన ఎక్స్‌‌‌‌పర్టులతోనే కాకుండా, స్టార్టప్‌‌‌‌లు ఉన్న సంబంధిత ఇండస్ట్రీల్లోని ఎక్స్‌‌‌‌పర్టులతో, వెంచర్‌‌‌‌‌‌‌‌ క్యాపిటలిస్టుతో కూడా మెంటరింగ్ అందించనున్నారు. వీరితో పాటు గూగుల్‌‌‌‌ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌‌‌‌ సంజయ్ గుప్తా, సెకోవియా ఇండియా ఎండీ రాజన్‌‌‌‌ ఆనందన్‌‌‌‌, లైట్‌‌‌‌స్పీడ్‌‌‌‌ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌‌‌‌ వీపీ మన్జోత్‌‌‌‌ పహ్వాలు కూడా ఈ ప్రోగ్రామ్‌‌‌‌ కింద స్టార్టప్‌‌‌‌లకు  మెంటరింగ్‌‌‌‌ ఇస్తారు.   ఫిన్‌‌‌‌టెక్‌‌‌‌, డైరెక్ట్‌‌‌‌ 2 కన్జూమర్‌‌‌‌‌‌‌‌, బిజినెస్‌‌‌‌ 2 బిజినెస్‌‌‌‌, సోషల్ మీడియా వంటి సెగ్మెంట్‌‌‌‌లలో స్టార్టప్‌లు తమ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను డెవలప్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ సాయపడనుంది.  

ఐదేళ్లు కూడా ఉండడం లేదు..

దేశంలో 70 వేల స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌లు యాక్టివ్‌‌‌‌గా పనిచేస్తుండగా, వీటిలో 50 శాతం స్టార్టప్‌‌‌‌లు  మెట్రోసిటీలకు వెలుపలే ఉన్నాయని గూగుల్‌‌‌‌ ప్లే పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌ డైరెక్టర్ ఆదిత్య స్వామి అన్నారు.  ఈ 50 శాతం స్టార్టప్‌‌‌‌లలో 90 శాతం మొదటి ఐదేళ్లలోనే మూతపడుతున్నాయని చెప్పారు. ఈ స్టార్టప్‌‌‌‌లు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలను నాలుగు విభాగాలుగా విడదీయొచ్చని స్వామి పేర్కొన్నారు. ‘అందులో ఒకటి:  బిజినెస్‌‌‌‌ను విస్తరించడానికి సరియైన వారిని ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నాయా? రెండు: మార్కెట్‌‌‌‌కి తగ్గ ప్రొడక్ట్‌‌‌‌లను తెస్తున్నాయా? మూడు: మంచి ఐడియా అయినప్పటికీ ఈ ఐడియాకు మంచి మార్కెట్ ఉందా? నాలుగు: వినియోగదారుల నుంచి ఫీడ్‌‌‌‌బ్యాక్‌‌‌‌ను అందుకొని బిజినెస్‌‌‌‌ మోడల్‌‌‌‌ను మెరుగుపరుచుకోగలుగుతున్నాయా?  అనే అంశాల్లో స్టార్టప్‌‌‌‌లు ఫెయిల్ అవుతున్నాయి’ అని స్వామి వివరించారు.  గూగుల్ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌తో పాటు, ఇతర ఇండస్ట్రీ ఎక్స్‌‌‌‌పర్టులు అనుభవాలను స్టార్టప్‌‌‌‌లతో పంచుకోవడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశమన్నారు.  అగ్రిటెక్‌‌‌‌,  హెల్త్‌‌‌‌టెక్‌‌‌‌, ఫిన్‌‌‌‌టెక్‌‌‌‌ వంటి వివిధ సెక్టార్లలో భారీ అవకాశాలు ఉన్నాయని గూగుల్ ప్లే డెవలపర్‌‌‌‌‌‌‌‌ రిలేషన్స్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ మేనేజర్ కార్తిక్ పద్మనాభన్ అన్నారు.