గూగుల్ లో ఏఆర్ టెక్నాలజీతో రెండు కొత్త ఫీచర్లు

గూగుల్ లో ఏఆర్ టెక్నాలజీతో రెండు కొత్త ఫీచర్లు

గూగుల్.. షాపర్‌ల కోసం రెండు కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) ఫీచర్లు తీసుకొస్తోంది. వీటి సాయంతో వర్చువల్ విధానంలో గూగుల్ షాపింగ్ చేయొచ్చు. ఏఆర్ ఫీచర్ ద్వారా గూగుల్ షాపింగ్ లో ప్రొడక్ట్స్ ను 3డీ వ్యూతో 360 డిగ్రీలో చూడొచ్చు. వర్చువల్‌గా ఎక్స్ పీరియన్స్ చేస్తూ, షాపింగ్ చేయొచ్చు. ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే దాన్ని ఒక వ్యక్తి వేసుకుంటే ఎలా ఉంటుంది, ఫిట్టింగ్, ఒరిజినల్ కలర్ ఎలా ఉంటాయో కూడా ఈ ఫీచర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అందుకు ఆ ప్రొడక్ట్ వేసుకున్న మోడల్ ఫొటో, వీడియోలు సైట్ లో అందుబాటులో ఉంటాయి.

మరొక ఫీచర్ ఏంటంటే.. బ్యూటీ ప్రొడక్ట్స్ కస్టమర్ల స్కిన్ టోన్ కు నప్పుతాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. అందుకు గూగుల్ షాపింగ్ లో సదరు కస్టమర్ స్కిన్ టోన్‌తో ఉన్న మోడల్ ఫొటోలు అందుబాటులోకి తెచ్చింది. వాటికి కొనాలనుకున్న మేకప్ ప్రొడక్ట్స్ తో మేకప్ వేసి చూసుకోవచ్చు.