గూగుల్ క్రోమ్‌లో ఒక టాపిక్ సెర్చ్ చేస్తే దానికి సంబంధించి అనేక వెబ్సైట్లు కనిపిస్తాయి. అయితే అందులో అసలైనదేదో, నకిలీది ఏదో కనిపెట్టడం కష్టం. అందువల్లే చాలామంది యూజర్లు రకరకాల సైబర్ మోసాలకు గురవుతున్నారు కూడా. అయితే, ఇప్పుడు ఈ ప్రాబ్లెమ్‌కి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే స్టోర్ రివ్యూస్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ఎలాగంటే... ఏఐ ద్వారా ట్రస్ట్ పైలట్, స్కామ్ అడ్వైజర్ వంటి ఇండిపెండెంట్ ప్లాట్‌ఫాంల నుంచి యూజర్ల రివ్యూలను సేకరిస్తుంది. దాంతో వెబ్సైట్ విజిట్ చేసినవాళ్లకు దాని గురించి సమాచారం అందిస్తుంది.
క్రోమ్‌లో ఒక వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు అడ్రెస్ బార్లో ఐ అనే ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా సైట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఐకాన్‌కి బదులు స్టోర్ రివ్యూస్ అనే టైటిల్ రాబోతుంది. దానిమీద క్లిక్ చేయగానే ఏఐ– జనరేట్ చేసిన రివ్యూల సారాంశం కనిపిస్తుంది. ఇంతకుముందు ఒక వెబ్సైట్ గురించి తెలుసుకోవాలంటే ఎన్నో రివ్యూలు చూడాల్సి వచ్చేది.
కానీ, స్టోర్ రివ్యూస్ ఫీచర్ అందుబాటులోకి వస్తే అన్ని రివ్యూలు చూడాల్సిన పనిలేదు. వెబ్సైట్ రియల్ లేదా ఫేక్ అనేది వెంటనే తెలిసిపోతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.