స్పామ్ కాల్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. పనిలో బిజీగా ఉన్న టైంలో విసుగెత్తిస్తుంటాయి. టెలీ మార్కెటింగ్, బాట్ కాల్స్, అన్ నోన్, ఫ్రాడ్ నంబర్స్ నుంచే స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాటిని లిఫ్ట్ చేసినా, అందులో మాట్లాడే వాళ్లు చెప్పింది చేసినా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్, ఆడ్రాయిడ్ కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొచ్చాయి. వాటి సాయంతో స్పామ్ కాల్స్ కు దూరంగా ఉండొచ్చు.
గూగుల్ కాలర్ ఐడీ, స్పామ్ ప్రొటెక్షన్ అనే రెండు ఫీచర్లను అందిస్తోంది. ముందు గూగుల్ యాప్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అందులో కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఎనేబుల్ చేయాలి. తరువాత అగ్రీ బటన్ క్లిక్ చేస్తే, కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ యాక్టివేట్ అవుతుంది.
డైలర్ యాప్ ఓపెన్ చేసి పైన కనిపించే మూడు చుక్కల్ని క్లిక్ చేయాలి. అందులో సెట్టింగ్స్ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే ‘హరాజ్ కాల్స్’ అప్షన్ వస్తుంది. అందులో ‘అన్ ఫెమిలియర్ ఇన్ కమింగ్ కాల్స్’ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే స్పామ్ కాల్స్ ఆగిపోతాయి.
