నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

నెల్లూరు జిల్లా బోగోలు మండల పరధిలోని బిట్రగుంట రైల్వే స్టేషన్ వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణపట్నం పోర్ట్ నుండి గోండియా, వాడ్స వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బిట్రగుంట స్టేషన్ లో పట్టాలు క్రాస్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బోగీలు పట్టాలపై పడిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.