న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్లోన్లపై వడ్డీ రేట్లను మరో 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో హోమ్లోన్లపై వడ్డీ రేట్లు 6.50 శాతానికి దిగొచ్చాయి. ఈ ఆఫర్ నవంబర్ 8 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. క్రెడిట్ స్కోరు బాగున్న శాలరీడ్ కస్టమర్ల కోసం ఈ ఆఫర్ తీసుకొచ్చామని పేర్కొంది. కిందటేడాది అక్టోబర్లో కోటక్ హోమ్లోన్లు 6.9 శాతం వడ్డీ రేటు నుంచి అందుబాటులో ఉండేవి. వడ్డీ రేట్లను రెండు సార్లు తగ్గించి ప్రస్తుతం ఉన్న 6.65 శాతానికి తీసుకొచ్చారు. తాజాగా మరోసారి 0.15% తగ్గించి 6.50% వడ్డీ రేటు నుంచే హోమ్లోన్లను బ్యాంక్ ఇస్తోంది.
