రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. 78 రోజుల వేతనం బోనస్

రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. 78 రోజుల వేతనం బోనస్
  • దీపావళి బోనస్ ప్రకటించిన కేంద్రం
  • 11.56 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ది

న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చిప్పింది. దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనం బోనస్ గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో వివరాలను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. 
దీపావళి బోనస్ పై జరిగిన చర్చలో 78 రోజుల వేతనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల 11.56 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. అలాగే  దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో  7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్ర) పార్కులు ఏర్పాటు చేయలని నిర్ణయించారు. పీఎం మిత్ర పార్కుల కోసం రానున్న ఐదేళ్ల కాలంలో 4 వేల 445 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్కుల వల్ల ప్రత్యక్షంగా 7 లక్షల మందికి, పరోక్షంగా మరో 14 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం మిత్ర పార్కుల ఏర్పాటు కోసం ఆసక్తి చూపిస్తున్నాయని కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ వివరించారు.