ఒకేసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబద్లో ఎంతంటే..

కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారి భారీగా పడిపోయాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు(డిసెంబర్ 6) మార్కెట్ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాములు 24 క్యారెట్ బంగారం ధర నిన్న(డిసెంబర్ 5) రూ. 64, 200లు ఉండగా.. ఈరోజు(డిసెంబర్ 6) రూ. 1090లు తగ్గి రూ. 63,110లుగా నమోదైంది. ఇక 10 గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,850లు ఉండగా.. ఈరోజు రూ. 1000లు తగ్గి రూ. 57,850లుగా నమోదైంది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 80,500 కాగా ఈరోజు(డిసెంబర్ 6) ఏకంగా రూ. 2000లు తగ్గి, రూ. 78500లకు చేరుకుంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* హైదరాబాద్ లో 22 క్యారెట్ ల బంగారం ధర.. రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110 ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ ల బంగారం ధర.. రూ.58,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,820 ఉంది.

* ముంబైలో 22 క్యారెట్ ల బంగారం ధర.. రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110 వద్ద కొనసాగుతుంది.

* బెంగళూరులో 22 క్యారెట్ ల బంగారం ధర.. రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110కి చేరింది. 

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం ధరల దారిలోనే వెండి కూడా పయనిస్తుంది.. ఈరోజు(డిసెంబర్ 6) వెండి ధర కూడా భారీగా  తగ్గింది.. 
హైదరాబాద్.. రూ. 81,400 ఉండగా.. విజయవాడ.. రూ. 81,400 దగ్గర ఉంది.. ఇక చెన్నై.. రూ.81,400 వద్ద ఉండగా.. ముంబాయి..రూ. 89,500 ఉంది. బెంగళూరు..రూ. 79,250 వద్ద నమోదు అయింది.