Good Health : మీరు రోజూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 14 జాగ్రత్తలు పాటించండి.. ఆస్పత్రికి వెళ్లే అవసరమే రాదు.. !

ఆరోగ్యంగా ఉండాలి హాయిగా నవ్వాలి అని అందరకీ ఉంటుంది. అందుకోసం చెయ్యాల్సిన పనులు మాత్రం చేయరు. విపరీతంగా తినేస్తారు.ఎంత రాత్రైనా నిద్రపోకుండా టీవీ చూస్తారు. కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఇవన్నీ చేస్తూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు న్యూట్రిషియనిస్టులు.

ఈ సూత్రాలు పాటిస్తే చాలు: 

  • ఎక్కువ కొవ్వు పదార్ధాలున్న ఆహారానికి దూరంగా ఉండాలి.వెల్లుల్లిని నూనెలో కలిపి.. ఆ నూనె చుక్కలను అప్పుడప్పుడూ చెవిలో వేసుకోవాలి.
  • ఎక్కువగా మంచి నీళ్ళు తాగాలి. రాత్రిళ్లు మాత్రం కొంచెం తక్కువ నీళ్ళు తాగాలి. అలాగే నిద్రపోయే ముందు బ్లాడర్ను ఖాళీ చేసుకోవాలి. 
  • పుదీనాను రెగ్యులర్ గా తీసుకుంటే ముక్కు సంబంధిత సమస్యలు దరిచేరవు. 
  • ఉప్పును తగ్గిస్తే గుండె సమస్యలు అంతగా రావు.
  • ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉండేదుకు స్మోకింగ్ మానేయాలి.
  • పచ్చి బఠాణీ రోజూ తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులకు దూరంగా ఉండొచ్చు.
  • జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే అలాంటి వాళ్ళు ఎక్కువ కూరగాయలను తినాలి.అప్పుడే జీర్ణాశయం బాగుంటుంది.
  • నువ్వుల నూనెతో నోటిని పుక్కలిస్తే నోరు ఆరోగ్యంగా ఉంటుంది.
  • రోజూ ఒక పచ్చి ఉల్లిపాయ తింటే యూరినరీ ట్రాక్ శుభ్రంగా ఉంటుంది.
  • కొద్దిగా నూనెతో కళ్ళను మసాజ్ చేస్తుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
  • మిరియాలను తరచుగా తీసుకుంటే గొంతు బాగుంటుంది.
  • నిమ్మరసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అపెండిక్స్ ఇబ్బందులు రావు 
  • రోజుకి 8 గంటలు నిద్రపోతే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

==  V6 వెలుగు లైఫ్