దేశ వ్యాప్తంగా ఇవాళ గోల్డ్ షాప్స్ బంద్

దేశ వ్యాప్తంగా ఇవాళ గోల్డ్ షాప్స్ బంద్

బంగారు నగలకు హాల్ మార్క్ యూనిక్ ఐడీ అమలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా గోల్డ్ షాప్స్ బంద్ అయ్యాయి. హైదరాబాద్ లో గోల్డ్ షాప్స్ మూసివేసి  జ్యువెలరీ అసోసియేషన్స్ బంద్ లో పాల్గొన్నాయి. హైదరాబాద్ అబిడ్స్ లో గోల్డ్ షాప్స్ అన్నీబంద్ చేసి ఆందోళనలో పాల్గొన్నారు అసోసియేషన్ నాయకులు.  కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన  HUID ని ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు..ట్విన్ సిటీస్ జ్యువెలరీ అసోసియేషన్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అన్నారు.   ఆరు అంకెల హాల్  మార్క్ యూనిక్ ఐడి, అస్సేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్స్ దగ్గర  చాలా సమయం పడుతోందన్నారు. దీంతో నగలు పేరుకుపోతున్నాయన్నారు.  కొత్తగా వచ్చిన HUID పద్దతితో కస్టమర్లు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. గతంలో ఉన్న హాల్  మార్క్ పద్దతినే కొనసాగించి..HUID ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.