గోల్డ్ ధరలు ఇండియాలో రికార్డు స్థాయిని తాకాయి. ఒక్క రోజే 10 గ్రాముల బంగారం రూ.2 వేల మేర పెరిగింది. దీంతో ఫ్యూచర్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.45,724 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఎంసీఎక్స్ లో జూన్ ఫ్యూచర్స్ ఇటీవల ట్రేడ్‌లో 3.5 శాతం పెరిగి రూ.45,269కు ఎగిసిన సంగతి తెలిసిందే. సిల్వర్ ఫ్యూచర్స్ కూడాఎంసీఎక్స్ లో 5 శాతం పెరిగి కేజీకి రూ.43,345 వద్ద నమోదైంది. డాలర్ బలపడుతుండటంతో, గ్లోబల్ మార్కెట్లలో మాత్రంగోల్డ్ స్వల్పంగా తగ్గి ఔన్స్ కు 1,657.67 డాలర్ల వద్ద ట్రేడైంది. గత సెషన్‌లో అయితే గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ధర 3 శాతం పెరిగింది. కరోనా వైరస్ మరణాలు తగ్గుతున్నట్టు సంకేతాలు వస్తుండటంతో, వాల్ స్ట్రీట్ లో రాత్రికి రాత్రే ర్యాలీ చోటు చేసుకుంది. దీంతో అన్ని ఆసియన్ ఈక్విటీ మా ర్కెట్లు పెరిగాయి. ఈటీఎఫ్‌ల్లోకి స్ట్రాంగ్ ఇన్‌ఫ్లోలు గోల్డ్ ధరలకు సపోర్ట్ ఇస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ బ్యాక్ట్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్‌పీ డీఆర్ గోల్డ్ ట్రస్ట్ లో హోల్డిం గ్స్0.54 శాతం పెరిగి 984.24 టన్నులకు చేరుకున్నాయి.
ప్రభుత్వాల చర్యలు.. గోల్డ్ కు సపోర్ట్
ప్రభుత్వాలు తీసుకుంటోన్న స్టిమ్యులస్ చర్యలు, కేంద్ర బ్యాంక్‌ల చర్యలు గోల్డ్ ధరలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ సోమవారం నుంచి చిన్న వ్యాపారాలకు లెండింగ్ ఇచ్చేందుకు ఒక ప్రొగ్రా మ్‌ను ప్రకటించింది. అలాగే జపాన్ కూడా ఎకనమిక్ స్టిమ్యులస్ ప్యాకేజీ ప్రకటించింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి గోల్డ్ ధరలు పెరుగుతోన్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా కారణంతో చాలా దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుండటం కూడా ఫిజికల్ డిమాండ్ పై ప్రభావం చూపుతోంది. మార్చిలో ఇండియా గోల్డ్ దిగుమతులు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఒకవైపు ధరలు రికార్డుస్థాయిలో ఉండగా.. మరోవైపు దిగుమతులు పడ్డాయి. లాక్‌డౌన్ రిటైల్ డిమాండ్‌ను దెబ్బకొడుతోందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.
