పెరిగిన బంగారం ధరలు

పెరిగిన బంగారం ధరలు

రూపాయి విలువ తగ్గడంతో  బంగారం ధర 454 రూపాయలు పెరిగి రూ. 51,879 కు చేరుకున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది. ఇక కిలో వెండి 117 రూపాయలు భారమై 62,058 రూపాయలకు పెరిగింది.  అంతకుముందు ట్రేడ్‌లో వెండి ధర  కిలో రూ .62,376 నుంచి రూ .751 పెరిగి 63,127 రూపాయలకు చేరుకుంది.  డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గడంతో ఢిల్లీలో  24 క్యారెట్ల స్పాట్ బంగారం ధర 454 రూపాయలు పెరిగింది.  మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 1910 డాలర్లకు తగ్గాయి.