ముంబై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

ముంబై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

ముంబై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. కెన్యా నుంచి వస్తున్న ఓ ప్రయాణికురాలిని తనిఖీలు చేసిన అధికారులు ఆమె వద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్న 3.8 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఈ బంగారాన్ని ఆమె  కాఫీ బాటిళ్లలో దాచుకుంటూ  తీసుకువచ్చింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీలు చేసిన అధికారులు కాఫీ పౌడర్ బాటిళ్లలో దాచిపెట్టిన 3.8 కిలోల అప్రకటిత బంగారాన్ని, కొన్ని ప్రైవేట్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు, స్మగ్లింగ్ చేస్తున్న వారిలో ఒకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

బంగారాన్ని స్వాధీనం చేసుకునే ముందు అధికారులు 18 మంది కెన్యా మహిళలను విమానాశ్రయంలో తనిఖీలు చేశారు. మహిళలు తీసుకెళ్తున్న కాఫీ పౌడర్ బాటిళ్లు, ఇన్నర్‌వేర్ లైనింగ్‌లు, పాదరక్షలు, మసాలా బాటిళ్లలో బంగారాన్ని కడ్డీలు, వైర్లు, పౌడర్‌ల రూపంలో దాచి ఉంచారు. సుమారు రెండు కోట్ల విలువైన 3.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీలో 24కు చేరిన ఒమిక్రాన్ కేసులు

ఇకపై గాంధీలో జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు