ఉమామహేశ్వరీ దేవికి బంగారు నెక్లెస్

అచ్చంపేట, వెలుగు: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయంలోని అమ్మవారికి హైదరాబాద్ కు చెందిన రవికాంత్ గౌడ్  బంగారు నెక్లెస్ ను బహూకరించారు. హైదరాబాద్  నాగోల్ కు చెందిన రవికాంత్, రమ్య దంపతులు గతంలో ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని మొక్కుకున్నారు. అమ్మవారికి రూ.80 వేల విలువ చేసే నెక్లెస్ ను ఆలయ చైర్మన్  కందులు సుధాకర్​కు బుధవారం అందజేశారు. జగన్, రామకృష్ణ,శంకర్  పాల్గొన్నారు.