న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్–నవంబర్ పిరియడ్‌లో దేశ బంగారం దిగుమతులు 40 శాతం తగ్గాయి. కిందటేడాది ఇదే టైమ్‌లో గోల్డ్ దిగుమతుల విలువ 20.6 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది 12.3 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్‌ను మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం. కరోనా సంక్షోభంతో దేశంలో గోల్డ్ డిమాండ్ పడిపోయింది. ఫలితంగా బంగారం దిగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయి. కాగా, కిందటేడాది నవంబర్ తో పోలిస్తే ఈ నవంబర్ లో గోల్డ్ ఇంపోర్ట్స్ 2.65 శాతం పెరిగి 3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్–నవంబర్ లో సిల్వర్ దిగుమతులు 65.7 శాతం తగ్గి 752 మిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. గోల్డ్, సిల్వర్ దిగుమతులు తగ్గడంతో దేశ వాణిజ్య లోటు తగ్గుతోంది. ఈ ఏడాది ఏప్రిల్–నవంబర్ లో వాణిజ్య లోటు 42 బిలియన్ డాలర్లకు తగ్గింది. కిందటేడాది ఇదే టైమ్‌లో ఈ లోటు 113.42 బిలియన్ డాలర్లుగా ఉంది.
