900 ఏళ్ల కింద దాచిపెట్టిన బంగారం.. తవ్వకాల్లో బయట పడింది.. ఎక్కడంటే..

ఇజ్రాయెల్ లోని ప్రాచీన ఓడరేవు నగరం సీజరియాలో జరుపుతున్న పురాతత్వ తవ్వకాల్లో..900 ఏళ్ల కిందట దాచిపెట్టినవిగా భావిస్తున్న బంగారు నాణేలు బయటపడ్డాయి. ఒక గోడ పక్కన రాళ్ల మధ్య ఉన్న ఒక రాగి కుండలో ఈ బంగారు నాణేలతో పాటు ఒక బంగారు చెవి రింగు కూడా లభించింది.

ఈ నిధిని దాచిన వ్యక్తి 1101లో క్రూసేడుల సైన్యం నగరవాసులను ఊచకోత కోసినపుడు చనిపోయి ఉండవచ్చునని పురాతన తవ్వకాల శాస్త్రవేత్తలు అంటున్నారు. "ఈ నిధి యజమాని, వారి కుటుంబం ఆ ఊచకోతలో అంతమైపోవటం కానీ.. వారిని బానిసలుగా అమ్మివేయటం కానీ జరిగి ఉండొచ్చని భావించవచ్చు.

Also Read :- వేధింపులతో స్టూడెంట్ ​ఆత్మహత్యాయత్నం

అందువల్ల వాళ్ళు దాచుకున్న ఈ బంగారాన్ని తిరిగి తీసుకోలేక పోయి ఉంటారు" అని ఈ తవ్వకాలకు డైరెక్టర్లుగా ఉన్న డాక్టర్ పీటర్ జెండిల్మన్, మొహమ్మద్ హతార్లు విశ్లేషించారు. సీజరియా ప్రపంచ వారసత్వ సంపద ప్రాంతం సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో ఈ నిధి వెలుగుచూసింది. అబ్బాసిడ్, ఫాతిమిద్ కాలాలకు చెందిన నివాస ప్రాంతాలుగా వీటిని భావిస్తున్నారు.

== V6 వెలుగు లైఫ్