అలంపూర్ లో బంగారం, నగదు చోరీ

అలంపూర్, వెలుగు: ఉండవల్లి మండలం అలంపూర్  చౌరస్తాలోని ఈడిగ జ్యోతి ఇంటిలో 7 తులాల బంగారం, రూ.26 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. పండ్ల వ్యాపారం చేసుకొని బతికే ఆమె గత నెల 31న బంధువులు చనిపోవడంతో కర్నూలుకు వెళ్లారు. గురువారం రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి, బీరువా తాళం పగలగొట్టి అందులో ఉన్న 7 తులాల బంగారం ఆభరణాలు, రూ.26 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. శుక్రవారం ఉండవల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.